డీఎస్పీ వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్య
బనశంకరి: బోవి అభివృద్ధి మండలి లబ్ధిదారులకు మెటీరియల్స్ సరఫరా చేసే జీవా (33) అనే మహిళ డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. నగరంలో బనశంకరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర లేఔట్‌లోని ఇంట్లో శుక్రవారం ప్రాణాలు తీసుకుంది. మెటీరియల్ సరఫరాలో అవినీతి జరిగిందంటూ కేసు నమోదు కాగా, సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా జీవా సోదరి సంగీత మాట్లాడుతూ సీఐడీ డీఎస్‌పీ వేధింపులే తన సోదరి ప్రాణాలు తీశాయని ఆరోపించింది. ఆమె మాట్లాడుతూ నవంబరు 14 నుంచి 23 వరకు వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ చేయాలని కోర్టు సూచించింది. కానీ 14వ తేదీ నేరుగా విచారణకు రావాలని డీఎస్‌పీ కనకలక్ష్మీ ఆదేశించారు. విచారణలో ఆమె దుస్తులు తొలగించి, ౖసైనెడ్ తెచ్చావా అని ప్రశ్నిస్తూ వేధించారు. మీరంతా ఎందుకు బతుకుతున్నారు, నువ్వు మీ చెల్లెలు డబ్బు ఎలా సంపాదిస్తున్నారు అని హేళన చేసింది. తనకు రూ.25 లక్షలు ఇవ్వాలని, లేకపోతే మీరెందుకు బతకాలి వెళ్లి చచ్చిపో అని కనకలక్ష్మీ దూషించారు. తమ షాపులో అందరి ముందు అవమానపరిచిందని సంగీత ఆరోపించింది. జీవా రాసి 13 పేజీల డెత్‌నోట్‌లో ఇదే ఉందని తెలిపింది. సంగీత ఫిర్యాదు మేరకు బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
గ్యారంటీలను మెచ్చారు: డీకే
శివాజీనగర: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు 2028 అసెంబ్లీ ఎన్నికలకు దిక్సూచి అని కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడిన ఆయన, పోలింగ్ సర్వేలు ఫలించవని నేను చెప్పాను. అదే రీతిలో ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర ప్రజలు ప్రగతిదాయకమైన తీర్పు ఇచ్చారు. మా ప్రభుత్వ గ్యారంటీ, అభివృద్ధి పనులను మెచ్చుకొని ప్రజలు ఓటు వేసి గెలిపించారని చెప్పారు. చెన్నపట్టణలో కేంద్ర మంత్రి కుమారస్వామికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. బీజేపీ–జేడీఎస్ పొత్తును కూడా ప్రజలు అంగీకరించలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment