శివాజీనగర: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ద్వారా తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్న బీజేపీ–జేడీఎస్ నాయకులకు దీని ద్వారా తగిన గుణపాఠం చెప్పారని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఫలితాల గురించి నివాస కార్యాలయం కృష్ణాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్యారంటీ పథకాలు ఆదుకోవడం వల్లనే మేము గెలుపొందాం. ఉప ఎన్నికల ఫలితాలు ప్రజా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. గ్యారంటీలు, వక్ఫ్ చట్టం గురించి మత వివాదం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నించింది. కానీ ప్రజలకు జ్ఞానోదయమైంది అని అన్నారు. చివరకు ప్రధాని మోదీ కూడా గ్యారంటీ పథకాలను అనుసరిస్తున్నారన్నారు. ఏడవడమే దొడ్డగౌడ కుటుంబానికి అలవాటు అని దేవెగౌడను ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment