● బుల్ టెంపుల్ వీధిలో పరుస సందడి
బనశంకరి: చారిత్రక బసవనగుడి శనక్కాయల పరుస ప్రారంభానికి ముందే సందడి మొదలైంది. బసవనగుడి దొడ్డ బసవణ్ణ, దొడ్డ గణపతి ఆలయాల్లో 25–26 తేదీల్లో శనక్కాయల పరుస నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది కార్తీకమాసం చివరి సోమవారం బసవనగుడి శనక్కాయల పరుస ఆనవాయితీ. పరుసకు సమయం ఉండగానే శనివారం వీకెండ్ కావడంతో బుల్‌టెంపుల్ రోడ్డులో శనక్కాయల వ్యాపారులు, రైతులు అంగళ్లను ఏర్పాటు చేశారు. పేదల బాదామిగా పేరుపొందిన శనక్కాయలను నగరవాసులు ఉత్సాహంగా కొనుగోలు చేశారు. విద్యార్థులు ఎక్కువంది వచ్చారు. రాశులు పోసి కిలో రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. దొడ్డ బసవణ్ణ, దొడ్డగణపతి ఆలయాలు విద్యుత్ దీప కాంతులతో ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి.
వేరుశెనగలు కొనుగోలు చేస్తున్న యువతులు
పరుసకు ముందే సందడి ఆరంభమైంది
Comments
Please login to add a commentAdd a comment