విద్యార్థులకు పుస్తకాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

Published Mon, Nov 25 2024 7:33 AM | Last Updated on Mon, Nov 25 2024 7:33 AM

విద్య

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

రాయచూరు రూరల్‌ : సాంఘీక సంక్షేమ శాఖ ఆధీనంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీఎం, మైనార్టీ హాస్టల్‌ విద్యార్థులకు ఉచితంగా పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు. ఆదివారం దేవదుర్గ తాలూకాలోని అన్ని హాస్టళ్లకు మైనార్టీ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ హొన్నకాటమళ్లి ఆధ్వర్యంలో సీఐ అమరేష్‌ ప్రసంగిస్తూ పేదరికంలో పుట్టిన విద్యార్థులు విద్యనభ్యశించి క్రియాశీలురుగా చదివి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉత్తమ సేవలందించేందుకు సన్నద్ధం కావాలన్నారు. బాలయ్య, ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి కృష్ణ, ఆయుష్‌ జిల్లా ఆరోగ్య అధికారి శంకరగౌడ, రాఘవేంద్ర, హనుమంతరాయ, భీమేష్‌, మల్లేష్‌ నాయక్‌, ఆనంద్‌, ప్రసన్న, మానసయ్యలున్నారు.

సంక్షేమ సంఘానికి

కార్యవర్గం ఎన్నిక

హొసపేటె: కర్ణాటక రాష్ట్ర జీపీ సభ్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా సన్నక్కి లక్ష్మణ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆర్‌.రేఖ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా హెచ్‌ఆర్‌ శశిధర్‌, రాష్ట్ర కోశాధికారిగా ఎన్‌.శశికళ, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఆర్‌ఎన్‌ భుజంగ, రాష్ట్ర న్యాయ సలహాదారుగా వెంకటేష్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జి.రేవణసిద్దేశ్వర్‌, రాష్ట్ర కమిటీ సభ్యునిగా యూ.సోమప్ప ఎన్నికయ్యారు.

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది మృతి

నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు

రాయచూరు రూరల్‌: జిల్లాకు చెందిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దేవన్న నాయక్‌(75) మృతి చెందారు. ఆయన మరణానంతరం నేత్రాలను నవోదయ వైద్య కళాశాలకు కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అనుపమ, వెంకటేష్‌ నాయక్‌, జయంతి, శ్వేత, గీత, దేహ దాన జాగృతి అధ్యక్షుడు రాజేంద్ర కుమార్‌, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విఽశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, నరసింహనాయక్‌లున్నారు.

హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీ

రాయచూరు రూరల్‌ : నగరంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధీనంలో నిర్వహిస్తున్న హాస్టల్‌ను శనివారం తాలూకా ఇన్‌చార్జి అధికారి దురుగేష్‌ తనిఖీ చేశారు. హాస్టల్‌ను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలని సూచించారు. సాంఘీక సంక్షేమ శాఖాధికారి చిదానంద, కృష్ణ, మెహబూబ్‌, రంగప్పలున్నారు.

సంక్షేమ హాస్టల్‌లో వెట్టిచాకిరీ

విద్యార్థినులకు వార్డెన్‌ చిత్రహింసలు

రాయచూరు రూరల్‌ : జిల్లాలోని మాన్విలో దేవరాజ్‌ అరసు వెనుక బడిన వర్గాల సంక్షేమ శాఖ ఆధీనంలో నడుస్తున్న హాస్టల్‌లో విద్యార్థినులతో హాస్టల్‌ వార్డెన్‌ వెట్టి చాకిరీ చేయిస్తూ వారిని చిత్రహింసలు పెడుతున్న ఘటన ఆదివారం జరిగింది. హాస్టల్‌లో వార్డెన్‌ రజియా సుల్తాన్‌ మరుగుదొడ్లను ఽశుభ్రం చేయాలని, కిరాణ సామగ్రిని లోపల పెట్టాలని వెట్టి చాకిరీకి ఆదేశించడంతో పాటు చిత్రహింసలకు గురి చేస్తోందని విద్యార్థినులు ఆరోపించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని సదుపాయాలు కల్పించాల్సిన వార్డెన్‌ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. స్వచ్ఛత పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా తమ చేత పనులు చేయించినట్లు ఆరోపించారు. వెంటనే వార్డెన్‌ను వేరే చోటకు బదిలీ చేయాలని అధికారులను కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యార్థులకు  పుస్తకాల పంపిణీ 1
1/4

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

విద్యార్థులకు  పుస్తకాల పంపిణీ 2
2/4

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

విద్యార్థులకు  పుస్తకాల పంపిణీ 3
3/4

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

విద్యార్థులకు  పుస్తకాల పంపిణీ 4
4/4

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement