హుబ్లీ: రాష్ట్ర రాజకీయాల్లో తాత, తండ్రి, కుమారుడు ఇలా మూడు తరాల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ సీఎం, ఎంపీ బసవరాజ్ బొమ్మై కుటుంబానికి తొలిసారి ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. ఇటీవల శిగ్గాంవి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ బొమ్మై ఈ తొలి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. బసవరాజ్ బొమ్మై తండ్రి, మాజీ సీఎం దివంగత ఎస్‌ఆర్ బొమ్మై మనవడు, మాజీ సీఎం, తాజా ఎంపీ బసవరాజ్ బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై రాజకీయ రంగ ప్రవేశం ఓటమితో మొదలైంది. కాగా ఈ ముగ్గురికి తొలి ఎన్నికల ఫలితం చేదు అనుభవాన్ని మిగిల్చింది. న్యాయవాది అయిన ఎస్‌ఆర్ బొమ్మై తొలిసారిగా 1962లో కుందగోళ అసెంబ్లీ స్థానం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి టీకే కాంబ్లైపె ఓటమి చవిచూశారు. 1967లో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అప్పటి ఎమ్మెల్యే టీకే కాంబ్లైపె ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సీనియర్ బొమ్మై తొలిసారిగా ఎమ్మెల్యేగా విజేతగా నిలిచారు. అనంతరం ఆయన జనతా పార్టీ అభ్యర్థిగా హుబ్లీ గ్రామీణ నుంచి 1978 నుంచి 1985 వరకు వరుసగా మూడు సార్లు మాజీ సీఎం రామకృష్ణ హెగ్డే సారథ్యంలో జనతా పార్టీ తరపున గెలుపు సాధించారు. ఆ మేరకు 1989లో రాష్ట్ర నాలుగో ముఖ్యమంత్రి అయ్యారు. 1994 ఎన్నికల్లో ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజ్ బొమ్మై హుబ్లీ గ్రామీణ క్షేత్రం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన బసవరాజ్ బొమ్మై బీజేపీ అభ్యర్థి జగదీశ్ శెట్టర్ చేతిలో ఓటమి చవి చేశారు.
స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా..
అయితే ఆ తర్వాత ఆయన స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శిగ్గాంవి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా 2008, 2013, 2018, 2023 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2021 నుంచి 2023 వరకు 23వ రాష్ట్ర సీఎంగా ఎన్నికయ్యారు. అదే విధంగా బసవరాజ్ కుమారుడు భరత్ బొమ్మై ఈ నెల 13న జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలవడంతో తండ్రి రాజీనామా చేసిన శిగ్గాంవి క్షేత్రం నుంచే పోటీ చేసి ఓడిపోయారు. మొత్తానికి ఈ వారసత్వ కుటుంబానికి తొలి ఎన్నికల్లో పోటీ మాత్రం ఓటమితోనే ప్రారంభం కావడం వీరి రాజకీయ ప్రస్థానానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఓటమితోనే రాజకీయ ప్రస్థానం
బొమ్మై కుటుంబంలో గెలుపోటముల వైనం
Comments
Please login to add a commentAdd a comment