ఆప్తులను చూడకుండానే...
చింతామణి: చింతామణి వద్ద ప్రైవేటు బస్సు– కారు ఢీకొన్న ప్రమాదంలో కారు నడుపుతున్న టెక్కీ దుర్మరణం చెందారు. రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని దండుపాళ్యం దగ్గర ఆదివారం ఈ ఘోరం జరిగింది. వివరాలు.. ప్రవీణ్ (40) ఏపీలోని చిత్తూరు జిల్లా కలకడ మండలం కదిరిరాయనహళ్లి గ్రామవాసి. బెంగళూరులో ఓ కంపెనీలో ఐటీ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు మదనపల్లి పట్టణంలో పుట్టింట్లో ఉండడంతో ప్రతి శుక్రవారం సాయంత్రం అక్కడికి కారులో వెళ్లి ఆదివారం తిరిగి బెంగళూరుకు వచ్చేవాడు. అయితే గత శుక్రవారం పని ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో వెళ్లలేకపోయాడు. దీంతో ఆదివారం ఉదయం భార్య వద్దకు బయల్దేరాడు.
బస్సు కిందకు దూసుకెళ్లి
దండుపాళ్యం వద్ద మదనపల్లి నుంచి బైపాస్ మీదుగా బెంగళూరుకు వెళ్తున్న బస్సు– కారు ఢీకొన్నాయి. కారు అతివేగంగా రావడంతో బస్సు కిందికి దూసుకెళ్లి నుజ్జు నుజ్జుయింది. బస్సు ముందు భాగం కూడా ధ్వంసమైంది. టెక్కీ ప్రవీణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారును స్థానికులు, పోలీసులు కలిసి జేసీబీతో బయటకు తీశారు. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండగా వారికి చిన్న చిన్న గాయాలయ్యాయి. భార్య, అత్త, ఇతర బంధువులు హుటాహుటిన చింతామణి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. శవాన్ని చూసి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ మురళీధర్, కంచార్లహళ్లి ఎస్ఐ వెంకటరామప్ప, పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
చింతామణి వద్ద కారు– బస్సు ఢీ
చిత్తూరు టెక్కీ మరణం
భార్యాపిల్లల వద్దకు వెళ్తుండగా విషాదం
Comments
Please login to add a commentAdd a comment