మూలరాముడికి శతకంఠ గానం
హొసపేటె: మంత్రాలయ మహా సంస్థానానికి చెందిన మూలరామ దేవుడిని సంప్రదాయబద్ధంగా మఠానికి తీసుకొచ్చిన ఘనత రఘనంద తీర్థదేనని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం అధిపతి సుబుధేంద్ర తీర్థులు తెలిపారు. హంపీ రఘునందస్వామి తీర్థమఠం మూల బృందావనంలో ఆయన భక్తులను ఆశీర్వదించారు. ఉదయం మూల బృందావనంలో ప్రత్యేక ఫల పంచామృతాభిషేకం, వెండి, పట్టు, వస్త్రాల అలంకరణలు నిర్వహించారు. అనంతరం మూల బృందావనాన్ని రకరకాల పూలతో అలంకరించారు. మూలరామదేవుని సంస్థాన పూజలను నిర్వహించి, తరలివచ్చిన భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం నైవేద్యం, హస్తోదకం నిర్వహించి మహామంగళారతి నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. మంత్రాలయ గురుసౌర్వభౌమ దాస సాహిత్య ప్రాజెక్టు రాష్ట్ర కో–ఆర్టినేటర్ సులాది హనుమేశాచార్యులు పాల్గొన్నారు.
దళితులపై అక్రమ కేసులు తగదు
రాయచూరు రూరల్: జిల్లాలో దళితులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం అధ్యక్షుడు గంగప్ప ఆరోపించారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరవార తాలూకా కవితాళ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోరణదిన్ని మలుపులో ఈనెల 15న ఎల్లమ్మ జాతర జరిగిందన్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాలకు మధ్య గొడవ ప్రారంభం కావడంతో కేసు నమోదు చేయడానికి కవితాళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన దళితులకు న్యాయం చేయకుండా మరో వర్గానికి న్యాయం చేసి తమపై తప్పుడు కేసులు బనాయించిన ఎస్‌ఐ వెంకటేష్ నాయక్‌ను విధుల నుంచి తొలగించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment