ఆస్పత్రిలో చిన్నారి అపహరణ
సాక్షి,బళ్లారి: ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్తే అక్కడ చిన్నారి అపహరణ జరిగింది. విజయపుర జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాగలకోట పట్టణానికి చెందిన రామేశ్వరి అనే మహిళ తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని విజయపురలో బంధువుల ఇంటికి వచ్చింది. అదే సమయంలో విజయపుర ఆస్పత్రిలో తల్లికి చికిత్స చేయించుకుంటున్నందున ఇద్దరు కుమారులతో ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో తల్లికి రక్తపరీక్షలు చేయించడానికి రామేశ్వరి వెళ్లగా పదేళ్ల వయస్సు గల కుమారుడు, ఏడాది వయస్సు గల సందీప్ అమ్మమ్మ దగ్గర ఉన్న సమయంలో చిన్నారి ఏడవడానికి మొదలు పెట్టడంతో అన్న ఓదారుస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఏడాది చిన్నారిని అపహరించాడు. కుమారుడు కనిపించక పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రామేశ్వరి వైద్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఓ వ్యక్తి అపహరించిన చిత్రం, వీడియో లభించింది. దీంతో బాలుడిని అపహరించిన వ్యక్తితో పాటు చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. కాగా ఆస్పత్రిలో చిన్నారి అపహరణకు గురి కావడంతో విజయపుర ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు భయాందోళన చెందుతున్నారు.
రోదిస్తున్న బాలుని తల్లిదండ్రులు
ముమ్మర గాలింపులో పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment