గ్యారెంటీలే విజయ సోపానాలు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయానికి ఐదు గ్యారెంటీలు ప్రధానమని కేపీసీసీ కార్యాధ్యక్షుడు, ఎమ్మెల్సీ వసంత కుమార్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ, జేడీఎస్‌లు ఏకమై ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పదవి నుంచి తొలగించడానికి ముడా, వాల్మీకి మండలిలో అక్రమాలు జరిగాయంటూ గగ్గోలు పెడుతూ రాష్ట్ర గవర్నర్ భవనానికి ఫిర్యాదు చేసిన విషయాలను ప్రస్తావించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మూడు చోట్ల బ్రహ్మరథం పట్టిన అంశాలను వివరించారు. రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్‌లు ఏకమై మధ్యప్రదేశ్, గోవాల మాదిరిగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పదవి నుంచి తొలగించడానికి కుట్రలు పన్నినా ప్రజలు మాత్రం వారికి బుద్ధి చెప్పారన్నారు. మహారాష్ట్ర, జార్ఖంఢ్‌లో బీజేపీ విజయాలకు ఈవీఎంలు బలంగా పని చేశాయని ఆరోపించారు. ఈ విషయంలో ఎన్నికల ప్రధాన అధికారి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై విచారణ జరపాలన్నారు. భవిష్యత్తులో బ్యాలెట్ పేపరుతో ఎన్నికలు జరపాలన్నారు. జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, శివమూర్తి, అమరేగౌడ, శాంతప్ప, అబ్దుల్ ఖరీం, రజాక్ ఉస్తాద్‌లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment