చట్ట పరిజ్ఞానం అవసరం
సాక్షి,బళ్లారి: శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నా చట్టాల గురించి పరిజ్ఞానం, కనీస అవగాహన లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని, ఎన్ని డిగ్రీలు చదివినా మన రాజ్యాంగంలోని అంశాలు, చట్టాల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయమూర్తి కే.జీ.శాంతి పేర్కొన్నారు. ఆమె ఆదివారం రాష్ట్ర చట్ట సేవల ప్రాధికార, జిల్లా చట్ట సేవల ప్రాధికార, చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, జిల్లా న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని తాళూరు రోడ్డులోని న్యాయాలయ సంకీర్ణ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమాజంలో వంచితులైన, ఇబ్బందులకు గురి అవుతున్న వారికి న్యాయం జరిగేందుకు తోడ్పాటును అందించాలన్నారు. సమాజంలో అందరికీ సమాన హక్కులు, అభివృద్ధితో పాటు జనం సుఖమయ జీవితం సాగించాలంటే తమ దైనందిన జీవితంలో చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
వంచితులకు న్యాయం అందించాలి
జిల్లా న్యాయమూర్తి కే.జీ.శాంతి
Comments
Please login to add a commentAdd a comment