జననేతకు ఘన స్వాగతం
సాక్షి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఏపీ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు వద్ద ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ నాలుగు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనను ముగించుకుని బెంగళూరుకు రోడ్డు మార్గాన బయలుదేరారు. ఈ క్రమంలో బాగేపల్లి టోల్‌ప్లాజా వద్ద కర్ణాటక వైస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు అశేషంగా తరలివచ్చి వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. కర్ణాటక వైఎస్ జగన్ అభిమానుల సంఘం బాగేపల్లి శాఖ అధ్యక్షుడు నారేపల్లి రాజేశ్ రెడ్డి నేతృత్వంలో స్వాగతం పలికారు. జననేత కోసం పెద్దఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాగేపల్లి టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కారు నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
కూటమి పాలనపై జనం విరక్తి
స్థానిక నేతలు విజయ్ రాఘవరెడ్డి తదితరులు మాట్లాడుతూ టీడీపీ కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాలు, అసత్య హామీల వల్లనే 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కూటమి పాలనపై ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, భవిష్యత్తులో మరోసారి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కి ప్రజానీకానికి మరింత మేలు చేకూరుస్తారని పేర్కొన్నారు.
జనసంద్రమైన బాగేపల్లి టోల్‌గేటు
Comments
Please login to add a commentAdd a comment