వంతెన మరమ్మతుల పూర్తికి వినతి
బళ్లారి టౌన్: నగరంలో 15వ వార్డు పరిధిలోని బాలాజీ రావ్ రోడ్డులో వడ్డరబండ రాజ కాలువపై భారత్ బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద గల పాత వంతెనకు సత్వరం మరమ్మతులు పూర్తి చేయాలని యువసేన సోషల్ యాక్షన్ క్లబ్ అధ్యక్షుడు మేకల ఈశ్వర్‌రెడ్డి బుధవారం పాలికె కమిషనర్‌కు, పాలికె అధ్యక్షుడు ముల్లంగి నందీష్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల క్రితమే ఈ పాత వంతెన కూలినా దీనిపై అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు. ఈ ప్రాంతంలో అధికంగా గ్యారేజీలు ఉండటంతో పాటు మార్కెట్ నుంచి వచ్చే వాహనాలు ఈ రోడ్డు వెంటే ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయన్నారు. దీంతో ఇతర రోడ్లలో చాలా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందన్నారు. అందువల్ల వెంటనే వంతెనకు మరమ్మతులు చేపట్టాలని ఒత్తిడి చేశారు. సభ్యులు కృష్ణ, బాషా, శ్రీనివాస్‌రెడ్డి, మల్లప్ప, జగన్నాథ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment