ఆస్తి వ్యామోహం.. కొడుకు కిరాతకం
మండ్య: ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే వేధిస్తున్నాడో కర్కోటక కుమారుడు.. ఈ ఘటన మేలుకోటె పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. తల్లిదండ్రుల కాళ్లు చేతులు విరిగేలా రెండో కుమారుడు దాడి చేశాడు. తండ్రి జవరేగౌడ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కుమారుడు నీలేగౌడకు అతని వాటా ఆస్తిని ఇచ్చేసి, మా జీవనం కోసం కొంత ఆస్తిని ఉంచుకున్నాము. అయితే ఆ మిగిలిన ఆస్తిని కూడా ఇవ్వాలని నిత్యం వేధిస్తున్నాడు. నవంబర్ 17న దాడి చేశాడని, నాకు చేతులు విరిగిపోయాయని, శరీరంపై అనేక గాయాలయ్యాయని, నా భార్య భాగ్యమ్మ కాలు విరిగిపోయిందని వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే కేసు రాయకుండా పోలీసులపై ఒత్తిడి చేస్తున్నాడని చెప్పారు. న్యాయం చేయాలని ఎస్పీ మల్లికార్జున బాలదండికి మొర పెట్టుకున్నామన్నారు. ఒకవేళ న్యాయం లభించకుంటే తమకు కారుణ్య మరణం కల్పించాలని జిల్లాధికారిని కోరుతామని చెప్పారు.
తల్లిదండ్రులనే చావబాదాడు
Comments
Please login to add a commentAdd a comment