తీవ్రంగా బాధిస్తోంది: శ్రీరాములు
సాక్షి, బళ్లారి: రాష్ట్ర బీజేపీలో ముఖ్య నేతగా చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి బి.శ్రీరాములుకు అనూహ్య పరిణామం ఎదురైంది. ఇటీవల జరిగిన సండూరు అసెంబ్లీ క్షేత్రం ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంపై వాడీవేడిగా చర్చ జరిగింది. బెంగళూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ కోర్‌కమిటీ సమావేశం ఇందుకు వేదికై ంది. రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి రాధామోహన్‌దాస్ అగర్వాల్ మాట్లాడుతూ సండూరులో బీజేపీ ఓటమికి కారణం శ్రీరాములేనని వ్యాఖ్యానించడం గమనార్హం. మీ సామర్థ్యం ఉంటే పార్టీ అభ్యర్థి ఎందుకు గెలవలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. సండూరులో పరాజయం గురించి అగర్వాల్ చాలాసేపు సమీక్ష చేశారు. ఇందులో శ్రీరాములు వైఫల్యం ఉందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమయంలో సీనియర్లు మౌనంగా ఉండిపోయారు.
బెంగళూరులో పార్టీ భేటీలో విచారంగా శ్రీరాములు (వృత్తంలో)
ఈ నేపథ్యంలో శ్రీరాములు టీవీ చానెళ్లతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాపై పార్టీ ఇన్‌ఛార్జి ఆరోపణలు చేయడం తీవ్రంగా బాధిస్తోంది. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసే వ్యక్తిని కాదు. మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి చెప్పడంవల్లనే పార్టీ ఇన్‌చార్జి అలా మాట్లాడారు. గాలి జనార్దనరెడ్డి నన్ను రాజకీయంగా ముగింపు చేసేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని శ్రీరాములు దుయ్యబట్టారు. నాపై కళంకం వచ్చేలా చేశారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తాను. ఇలాంటి ఆరోపణలు చేసిన తర్వాత ఎందుకు పార్టీలో ఉండాలి? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అగ్రనాయకుడు అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళతానన్నారు. తనపై అగర్వాల్ ఆరోపణలు చేసినప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఊరికే ఉన్నారని, రక్షించేలా మాట్లాడలేదని శ్రీరాములు విచారం వెలిబుచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నాయకత్వం ఎవరిని నిలిపినా మద్దతు ఇస్తానన్నారు. బసనగౌడ యత్నాల్, లేదా ఇతర ఏ వర్గం వెంట వెళ్లబోనన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.
సండూరు ఉప ఎన్నికల్లో
ఓటమిపై రాష్ట్ర ఇన్‌చార్జి అసహనం
సరిగా పనిచేయలేదని కస్సుబుస్సు
రాష్ట్ర బీజేపీలో అనూహ్య పరిణామం
Comments
Please login to add a commentAdd a comment