No Headline
చిన్న వయసులోనే వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. సొంతూర్లో పండ్లు కూరగాయలను సేకరించి, ధర ఉన్న చోటు అమ్మి ఉపాధిని చూసుకునేవారు. అదే మాదిరిగా కూరగాయలను తరలిస్తుండగా విధికి కన్నుకుట్టింది. మృత్యువు కోరలు చాచింది. 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పొగమంచు వల్ల డ్రైవర్ అదుపు తప్పడమే కారణమని తెలిసింది.
బనశంకరి: ఉత్తర కన్నడ (కార్వార) జిల్లా యల్లాపుర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూరగాయల లారీ బోల్తాపడటంతో 10 మంది యువ వ్యాపారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ సవణూరుకు చెందిన కూరగాయలు, పండ్ల వ్యాపారులు. గాయపడిన 15 మందికి పైగా క్షతగాత్రులను హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లారీ కింద చిక్కుకుని..
వివరాలు... హావేరి జిల్లాలోని సవణూరు నుంచి వ్యాపారులు తమ ఉత్పత్తులను ఉత్తర కన్నడ జిల్లాలోని కుమటాలో అమ్మడానికి లారీలో నింపుకొని వెళుతున్నారు. పండ్లు, కూరగాయల బస్తాల మీదే కూర్చున్నారు. లారీ హైవేలో ప్రయాణిస్తూ యల్లాపుర వద్ద గుళ్లాపుర దగ్గర అదుపుతప్పి రోడ్డుపక్కన పల్టీలు కొట్టింది. లారీ కింద చిక్కుకుని 10 మంది విగతజీవులయ్యారు. 16 మంది గాయాల పాలయ్యారు. కూరగాయలు, పండ్లు తో నింపిన లారీలో మొత్తం 28 మంది వ్యాపారులు ప్రయాణిస్తున్నారు. లారీ బోల్తా పడగానే బరువైన సంచుల కింద చిక్కుకుపోయారు.
గంట పాటు ఊపిరాడక...
స్థానికులు, పోలీసులు క్రేన్ వచ్చి లారీని పైకి ఎత్తగా కింద క్షతగాత్రులు ఉన్నట్లు తెలిసింది. అప్పటికే ఊపిరాడక 9 మంది చనిపోయారని జిల్లా ఎస్పీ నారాయణ్ తెలిపారు. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందన్నారు. ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వడానికి వెళ్లిన లారీ డ్రైవరు రోడ్డు పక్కన విద్యుత్ స్థంబాన్ని ఢీకొట్టడంతో లారీ బోల్తాపడింది. ఎక్కువమంది లారీ కింద చిక్కుకుపోయారు. గంట తరువాత ప్రమాద విషయం తెలిసి సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఆలస్యం వల్ల ప్రాణనష్టం అధికమైంది. మరొకరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తలా రూ.3 లక్షలు పరిహారం ప్రకటించింది. జిల్లా కలెక్టర్ కే.లక్ష్మీప్రియా మృతుల కుటుంబాలకు పరిహార ఆదేశాలను అందజేశారు. సీఎం సిద్దరామయ్య, హావేరి ఎంపీ బసవరాజ బొమ్మై సంతాపం తెలిపారు.
మృతుల్లో కొందరి చిత్రాలు (ఫైల్)
దుర్ఘటన జరిగిన చోటు
కూరగాయల లారీ పల్టీ
10 మంది వ్యాపారుల దుర్మరణం
ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర వద్ద ప్రమాదం
16 మందికి గాయాలు
మృతులు హావేరి జిల్లావాసులు
సాధారణ క్షతగాత్రులు
మాలిక్ రెహన్ (21), అఫ్తాబ్ (23), గౌస్‌మొద్దీన్ (30), ఇర్ఫాన్ (17), నూర్ అహ్మద్ (30), అఫ్సర్ కాంజాడ్ (34), సుభాష్‌గౌడర్ (17), ఖాద్రీ (26), సాబీర్ అహ్మద్ బాబాహుసేన్ గవారి (38), మర్దాన్‌సాబ్ (22), రఫాయి (21), మహమ్మద్ గౌస్ (22).
7 మందికి తీవ్రగాయాలు
అష్రఫ్ (18), ఖ్వాజా (22), మహ్మద్ సాదిక్ (25), ఖాజా మైను (24), నిజామ్ (30), లారీడ్రైవరు ముద్లాన్ సాబ్ (24), జాఫర్ (22) వీరికి యల్లాపుర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసి హుబ్లీ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
మృతుల వివరాలు
మృతులు ఫయాజ్ జమఖండి (45), వాసీం ముడగేరి (35), ఇజాజ్ ముల్లా (20), సాదిక్‌బాషా (30), గులామ్ హుసేన్ జవుళి (40), ఇంతియాజ్ ముళకేరి (36), అల్ఫాజ్ జాఫర్ మండక్కి (25), జిలానీ అబ్దూల్ జఖాతి (25), అస్లంబాబులి బెణ్ణి (24), జలాల్ తారా (29).
Comments
Please login to add a commentAdd a comment