మైసూరు: భార్య పుట్టింటికి వెళ్లిందని కోపం, అక్రమ సంబంధమని అనుమానంతో ఓ భర్త రాక్షసునిగా మారిపోయాడు. కొడుకు ముందే ఆమైపె పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జిల్లాలోని హెచ్‌డీకోటె తాలూకా హనుమంతనగరలో జరిగింది. వివరాలు.. నిందితుడు మల్లేష్ నాయక్ మూలతః విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా బీబీ తాండాకు చెందిన వ్యక్తి. ఎనిమిదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మధురను పెళ్లి చేసుకున్నాడు. హెచ్‌డీ కోటెలోని కేఎస్‌ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత ఆరేడు సంవత్సరాలుగా భార్యను అదనపు వరకట్న వేధింపులకు గురి చేయడమేగాక ఆమెను అనుమానిస్తుండేవాడు. రోజూ తాగొచ్చి స్థలం కొనివ్వాలని భార్యతో గొడవ పడుతుండేవాడు. ఇలా ఉండగా కొన్ని రోజుల క్రితం రెండు రోజుల పాటు మధుర తమ పుట్టినింటికి వెళ్లి వచ్చింది. ఈ విషయం గొడవపడిన మల్లేష్ నాయక్ తమ చిన్నారి కొడుకు ఎదుటే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేయడంతో చుట్టుపక్కల వారు ఆమెను కాపాడి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. హెచ్‌డీకోటె పోలీసులు కిరాతక భర్తను అరెస్టు చేశారు.
భార్యపై పెట్రోలు చల్లి నిప్పు
Comments
Please login to add a commentAdd a comment