బనశంకరి: రేణుకాస్వామి హత్యకేసులో బెయిల్‌పై విడుదలైన నటుడు దర్శన్‌కు ఇబ్బందులు తప్పేలాలేవు. దర్శన్, పవిత్రగౌడతో పాటు 7 మంది నిందితులకు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. న్యాయవాది అనిల్ నిశాని ద్వారా అప్పీల్ చేసిన ప్రభుత్వం 1,492 పేజీల సమాచారాన్ని సమర్పించింది. హైకోర్టు బెయిల్ ఆదేశాలు, కామాక్షిపాళ్య పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదు కాపీ, పంచనామా నివేదిక, సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్, మొబైల్ నివేదికలు, చార్జిషీట్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన పిటిషన్ విచారణకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment