ఔషధ ప్రయోగాలు వికటించి రైతు బలి
దొడ్డబళ్లాపురం: ప్రైవేటు ఔషధ కంపెనీలో నూతన ఔషధాల ప్రయోగాలకు హాజరైన వ్యక్తి మరణించిన సంఘటన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో చోటుచేసుకుంది. మృతుడిని కలబుర్గికి చెందిన నాగేశ్ (33)గా గుర్తించారు. వివరాలు.. వ్యవసాయం చేసుకుంటున్న నాగేశ్ కొంతకాలం క్రితం యాప్ ద్వారా ఒక కంపెనీ జరిపే ఔషధ ప్రయోగాలకు పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ 2వ వారంలో బెంగళూరుకు వచ్చి ప్రయోగాల కోసం ఔషధాలను సేవించాడు. రెండు రోజుల తరువాత నాగేశ్ కు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 10 రోజులు చికిత్స తీసుకుని కలబురిగిలోని ఇంటికి వెళ్లాడు. అయితే మళ్లీ ఆరోగ్యం పాడై పలు అవయవాల్లో రక్తం గడ్డకట్టి మృతిచెందాడు. నాగేశ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కంపెనీవారు డబ్బు ఇస్తామని ఆశ చూపడంతో ప్రయోగాలకు వెళ్లాడు. చిన్నపాటి అనారోగ్యాలు రావచ్చని చెప్పారు కానీ మరణం సంభవించదని అగ్రిమెంట్‌లో రాసిచ్చినట్టు చెప్పారు. బెంగళూరు జాలహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment