అడవులు ఖాళీ?
పోలీసులకు పతకాలు
కర్ణాటకను నక్సల్ విముక్తి రాష్ట్రంగా చేసేందుకు కృషి చేశారంటూ 22 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి సీఎం సిద్దరామయ్య పతకాలను ప్రకటించారు.
శివాజీనగర: కన్నడనాట నక్సలైట్ల పోరాటం చరమాంకానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు పలు జిల్లాల్లో పోలీసులకు, భూస్వాములకు సవాల్ విసిరిన మావోయిస్టులు ఇప్పుడు లొంగుబాటు బాట పడుతున్నారు. దీంతో అడవులు ఖాళీ అవుతున్నాయి. నక్సలైట్ల పోరాటంలో క్రియాశీలంగా ఉన్న కోటెకొండ రవి అలియాస్ రవిచంద్ర నమ్మార్ చిక్కమగళూరు జిల్లా శృంగేరి నుండి 4 కి.మీ. దూరంలో ఉన్న అటవీ శాఖ భవనంలో పోలీసుల ముందు లొంగిపోయారు. దీంతో రాష్ట్రంలో ప్రముఖ నక్సలైట్‌లు ఎవరూ లేకుండా పోయారు. ఇటీవల లొంగిపోయిన ఆరు మంది నక్సలైట్ల బృందంలో ఉన్న రవి కోటెకొండ.. విక్రంగౌడ ఎన్‌కౌంటర్ సమయంలో అడవిలోకి వెళ్లిపోయారు. ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయన వెంట పౌరహక్కుల నేతలు ఉన్నారు.
నక్సలైటు నేత కోటెకొండ
రవి లొంగుబాటు
నేడు అదే దారిలో మహిళా
నక్సల్ లక్ష్మీ
ముగింపు దశలో నక్సల్ ఉద్యమం
వరుసగా లొంగుబాటు పర్వాలు
నక్సల్ రవి కోటెకొండ లొంగిపోవటంతో పశ్చిమఘాట్లలో తుపాకుల పోరాటంలో నిమగ్నమైన అందరూ మావోయిస్టులు ప్రజా జీవనంలోకి వచ్చినట్లయింది. అండర్‌గ్రౌండ్‌లో పాతుకుపోయిన నక్సలైటుగా రవి పేరుపొందారు. 20 ఏళ్లకు పైగా మావోయిస్టు కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. గత నెలలో ముండగారు లత నేతృత్వంలో 5 మంది ముఖ్య నక్సలైట్లు సీఎం సిద్దరామయ్య ముందు లొంగిపోవడం తెలిసిందే. అప్పట్లో రవి ఆచూకీ లభించలేదు. లొంగిన నక్సల్స్, ప్రభుత్వ అధికారులు ఆయన కోసం ఆరా తీశారు. కొప్పె శృంగేరి అటవీ ప్రాంతంలో ఓ కుటుంబం ద్వారా ఆచూకీ తెలుసుకుని చర్చలు జరిపి ఒప్పించారు. లొంగిపోయిన తరువాత చిక్కమగళూరుకు తరలించారు. మరో మహిళా మావోయిస్టు తుంబట్టు లక్ష్మీ ఆదివారం లొంగిపోనున్నారని తెలిసింది. చిక్కమగళూరు లేదా ఉడుపిలో పోలీసుల ముందు ఈమె లొంగిపోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment