‘వికసిత భారత నిర్మాణంలో మరో మైలురాయిని స్థాపించే దూరదృష్టి కలిగిన బడ్జెట్ ఇది. ప్రముఖంగా రైతులు, మధ్యతరగతి కుటుంబాలు, పారిశ్రామిక రంగం సాధికారతను సాధించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. పెట్టుబడులకు, ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది’
– బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప
వ్యవసాయానికి ఊతం
‘ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రైతుపర ఆలోచనలతో 2025 ఏడాది బడ్జెట్‌ను తీసుకొచ్చారు. వ్యవసాయ రంగంలో సుస్థిరతతో పాటు రైతుల ఖర్చును తగ్గించే క్రమంలో పలు చర్యలను ఈ బడ్జెట్‌లో తీసుకొచ్చారు. రైతులు సాధికారత సాధిస్తూ ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా గ్రామీణ ఆర్థికతను బలపరిచేలా బడ్జెట్ తయారు చేశారు’
– కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి
రాష్ట్రానికి ఖాళీ చెంబు
‘కర్ణాటకకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖాళీ చెంబు ఇవ్వడం ఈసారి కూడా కొనసాగించింది. కర్ణాటకకు ఇదొక నిరాశదాయక, దూరదృష్టి లేని బడ్జెట్. కేంద్ర బడ్జెట్‌కు ముందు అనేక డిమాడ్లను ఉంచాము. ఒక్క డిమాండ్‌ని కేంద్రం నెరవేర్చలేదు’
– సీఎం సిద్ధరామయ్య
Comments
Please login to add a commentAdd a comment