యశవంతపుర: పోలీసే వసూల్‌రాజా మారి ఊచలు లెక్కిస్తున్నాడు. కాలేజీ విద్యార్థులుంటున్న రూంలోకి దూరి డబ్బులు దోచుకెళ్లిన హోంగార్డును బెంగళూరు సదాశివనగర పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో హోంగార్డుగా పని చేస్తున్న సురేశ్‌కుమార్.. జనవరి 25న రాత్రి ఎంఎస్ రామయ్యనగరలో కేరళ కాలేజీ విద్యార్థినులు ఉంటున్న రూంలోకి దూరాడు. మీరు కొందరిని ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. మీ సమస్యలు ఏమైనా ఉంటే తన రూంకు రావాలని సురేశ్‌కుమార్ గద్దించాడు. దీంతో అమ్మాయిలు భయపడి తమ బంధువుకు కాల్ చేయగా ఆయన అక్కడకు చేరుకున్నారు. ఏమిటని ప్రశ్నించగా తాను నేరాల విభాగం పోలీసు అధికారినని బెదిరించాడు. వారి నుంచి రూ. 5 వేలు లాక్కెళ్లాడు. యువతులు అతనిపై సదాశివనగర పోలీసులకు ఫిర్యాదు చేయగా సురేశ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఇతడు ఆరు నెలల నుంచి అమ్మాయిల గది పరిసరాల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. తన వద్ద అనేక సార్లు డబ్బులు వసూలు చేసిన్నట్లు ఒక యువతి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment