● టన్ను గెలలకు రూ.370 నుంచి రూ.560 పెంచుతూ ఆదేశాలు జారీ ● అశ్వారావుపేట నుంచి అప్పారావుపేటకు తరలించే గెలలకే..
అశ్వారావుపేటరూరల్: పామాయిల్ గెలల రవా ణా చార్జీలను పెంచుతూ తాజాగా ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏటా వార్షిక, గెలల దిగుమతి తగ్గిన సమయంతోపాటు ఇతర కారణాలతో అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని తాత్కాలింగా నిలిపి వేస్తుంటారు. ఆయా సమయంలో అశ్వారావుపేట మండలంలోని పామాయిల్ సాగుదారులంతా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి గెలలను తరలించాల్సి వస్తోంది. దీంతో ఆయిల్‌ఫెడ్ టన్ను గెలలకు రవాణా చార్జీ రూ.370 చెల్లిస్తోంది. కానీ అశ్వారా వుపేట నుంచి అప్పారావుపేట ఫ్యాక్టరీకి గెలలు తరలించేందుకు వాహనదారులు అధికంగా కిరా యి వసూలు చేస్తున్నారు. దీంతో సన్న, చిన్నకారు రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ఈ క్రమంలోనే రవాణా చార్జీలను పెంచాలని రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి చొరవతో ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఫలితంగా రూ. 190 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి టన్ను గెలల తరలింపునకు రూ.560 చొప్పున చెల్లించనున్నారు. కాగా దాదాపు ఇరవై వేల ఎకరాలకు సంబంధించిన రైతులకు ప్రయోజనం జరగనుందని ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment