ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలి..
● క్రీడాకారులను ప్రోత్సహించేలా 57 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ● వైరాలో గురుకులాల జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
వైరా: రాబోయే ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకాలు సాధించాలని.. ఈ దిశగా శిక్షణ ఇచ్చేందుకు 57 ఎకరాల్లో స్పోర్ట్స్ యూవర్సిటీ ఏర్పాటుచేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం గురుకులాల జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఈ పోటీలను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ గత ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశాల్లో క్రీడాకారులకు కన్సల్టెన్సీలుగా వ్యవహరించిన నిపుణులను పిలిపించి స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యరంగాలకు పెద్ద పీట వేసిందని.. రూ.657 కోట్ల నిధులతో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించినట్లు చెప్పారు. అలాగే, 28 ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఈనెల 14న మరో 60 గురుకులాలకు శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. ఇక విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచడమే కాక ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టి కొత్త ఉపాధ్యాయులను నియమించామని మంత్రి వెల్లడించారు. అలాగే, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గురుకులాల్లో కార్పొరేట్‌కు దీటుగా బోధిస్తూ, పట్టభద్రులు మరింత రాణించేలా శిక్షణ కోసం యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీని స్థాపించామని తెలిపారు. ఈసమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, గురుకులాల జోనల్ అధికారి కొప్పుల స్వరూపరాణి, డీసీఓ రాజ్యలక్ష్మి, వివిధ గురుకులాల ప్రిన్సిపాళ్లు డాక్టర్ డి.సమత, మీసాల సునీత, చావా జ్యోతి, ఎం.పద్మావతి, పీ.వీ. పద్మావతి, జ్యోతిలిల్లీ, విజయదుర్గ, విజయకుమారి, మైథిలి, ఎం.స్వరూపరాణి, ఐనాల సైదులు, ఉద్యోగులు సంజీవ్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, టి.సాయికుమార్‌తో పాటు నాయకులు బొర్రా రాజశేఖర్, శీలం వెంకటనర్సిరెడ్డి, దాసరి దానియేలు తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే...
వైరారూరల్: వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం మొదలైన జోనల్ స్థాయి టోర్నీలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి 14 గురుకుల పాఠశాలల విద్యార్థులు 1,190 మంది హాజరయ్యారు. తొలిరోజు పోటీల్లో విజేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహమతులు అందజేశారు. అండర్–17 విభాగం 1,500 మీటర్ల పరుగులో అక్విల సాయి(ములకలపల్లి), డి.సాగరిక(టేకులపల్లి), పి.కీర్తినందన(వైరా), 800 మీటర్ల పరుగులో బి.హాని(దానవాయిగూడెం), ఎం.హర్షిణి (ఇల్లెందు), డి.సాగరిక(టేకులపల్లి) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అండర్–19 విభాగం 1,500 మీటర్ల పరుగు పందెంలో ఎన్.భావన(ములకలపల్లి), 800 మీటర్ల పరుగులో వి.లావణ్య(కల్లూరు), యు.తేజస్విని(అంబేద్కర్ జూనియర్ కళాశాల, ఖమ్మం), టి.తేజ(వైరా) మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment