రూ.66.33 కోట్లతో మంచుకొండ ‘లిఫ్ట్’
వాతావరణ ం
జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు ఎండ ప్రభావం ఉంటుంది. రాత్రి మాత్రం చలిగాలుల తీవ్రత పెరుగుతుంది.
● సాగర్ నీటితో 30 చెరువులు నింపుతాం ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సాగర్ కెనాల్ నుంచి నీరు ఎత్తిపోసేలా మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రూ.66.33 కోట్లతో ప్రభుత్వం మంజూరు చేసిందని, దీంతో రఘునాథపాలెం మండలంలోని 30 చెరువులను నింపుతామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ధంసలాపురం వద్ద ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారి పనులను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎత్తిపోతల పథకం పనులకు వారంలోగా టెండర్లు పిలుస్తామని, త్వరగా పూర్తి చేసి వచ్చే ఆగస్ట్ 15 నాటికి మండలంలోని ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చెరువులను నింపుతామని వెల్లడించారు. వి.వెంకటాయపాలెం వద్ద ఎత్తిపోతలు ఏర్పాటు చేసి మండలానికి నీళ్లు తీసుకొస్తామని, తద్వారా గిరిజన రైతాంగానికి నీటి వసతి అందుబాటులోకి వస్తుందని మంత్రి చెప్పారు.
ఉగాది నాటికి దేవరపల్లి హైవే
హైదరాబాద్ – విశాఖపట్నం కారిడార్‌లో భాగంగా సూర్యాపేట, ఖమ్మం వరకు హైవే నిర్మాణం పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం – దేవరపల్లి వరకు 165 కి.మీ. మేర గ్రీన్ ఫీల్డ్ హైవేను ఐదు ప్యాకేజీల్లో చేపట్టగా, ఉగాది నాటికి పూర్తిచేయాలని నేషనల్ హైవే అధికారులకు సూచించారు. నాగ్‌పూర్–అమరావతి, ఖమ్మం–కురవి జాతీయ రహదారి పనులు కూడా పూర్తి చేయాలని తెలి పారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ప్రాజెక్టు డైరెక్టర్ దివ్య మ్యాప్ ద్వారా వివరించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు మానుకొండ రాధాకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment