ఫిర్యాదులు పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లో సోమవారం ఆయన పలువురి నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ పెట్టొద్దని తెలిపారు. మొదట కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమాల్లో డీఆర్వో రాజేశ్వరి, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు కొన్ని..
● వైరా మండలం పాలడుగుకు చెందిన రంగయ్య కుష్టు వ్యాధితో బాధపడుతున్న తనకు గతంలో దివ్యాంగుల పింఛన్ ఇచ్చినా సర్టిఫికెట్ గడువు ముగియడంతో ఆపేశారని తెలిపారు. ఈమేరకు సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని కోరారు.
● బోనకల్ మండలం పెద్దబీరపల్లికి చెందిన పి.సుమిత్ర సర్వే నంబర్ 575లో ప్రభుత్వం తనకు కేటాయించిన రెండెకరాల అసైన్డ్ భూమిని కబ్జా నుంచి విడిపించాలని వినతిపత్రం అందజేశారు.
నాణ్యత, నమ్మకమే బ్రాండ్
కలెక్టరేట్‌లో ఉన్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సోమవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. నలుగురు మహిళలు కలిసి క్యాంటీన్ నిర్వహిస్తుండగా వ్యాపారం తీరు, సమస్యలపై ఆరా తీశారు. నాణ్యత పాటిస్తూ, నమ్మకాన్ని చూరగొంటే వ్యాపారం వృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం డీఆర్వో ఎం.రాజేశ్వరి, డీఆర్డీవో ఎస్.సన్యాసయ్య, అదనపు డీఆర్డీఓ నూరొద్దీన్ తదితరులతో కలిసి కలెక్టర్ టీ తాగారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment