ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెరగాలి
ఏన్కూరు/తల్లాడ: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పు చేయించుకునేలా గర్భిణులకు అవగాహన కల్పించా లని.. తద్వారా కాన్పుల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. ఏన్కూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేసిన ఆమె పరిసరాలు, వార్డులు, ఓపీ గదులతో పాటు మందులను పరిశీలించి మాట్లాడారు. మందుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆతర్వాత కేజీబీవీని సందర్శించిన ఆమె భోజనం తయారీకి ఉపయోగిస్తున్న సామగ్రి నిల్వలు, నాణ్యతపై ఆరా తీశారు. అలాగే, తల్లాడ పీహెచ్‌సీని సైతం తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ కళావతి బాయి రోజువారీ వైద్యసేవలపై రికార్డులు పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఫార్మసిస్ట్ సెలవు విషయాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని వైద్యాధికారి రత్నమనోహర్‌ను ప్రశ్నించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సీతారాములు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చందునాయక్, డాక్టర్ రాములు, సీహెచ్‌ఓ శివరాజు పాల్గొన్నారు.
జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కళావతిబాయి
Comments
Please login to add a commentAdd a comment