నిందితులు చోరీ చేసేందుకు వస్తే మృతుల ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, గాజులు, ఉంగరాలను ఎందుకు వదిలేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారం, నగదు దొంగిలించకుండా వారిని ఎందుకు హత్య చేశారనే వివిధ కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల పంచాయితీ లేక స్థలాల క్రయ విక్రయాలపై వివాదాలు ఉన్నాయా అని విచారణ చేపట్టారు. దంపతులిద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారిని చంపాల్సిన అవసరం ఏంటి అనే కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. కుమారుడు నరేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన మహిళలే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు. ఆయన వెంట కూసుమంచి, కారేపల్లి సీఐలు సంజీవ్, తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment