ఆపదలో ఉన్న శిశువులను ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు నియోనేటల్ 108 వాహనాలు సేవలందిస్తున్నాయి.
8లో
గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2024
జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీలు, గురుకులాల నిర్వహణపై ఇటీవల ప్రభుత్వం దృష్టి సారించింది. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆదేశాలతో 21 మండలాల్లో 21 మంది ప్రత్యేకాధికారులు తనిఖీలు చేసి.. పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తేల్చినట్లు సమాచారం. ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో ఒకటి, రెండు వసతిగృహాలు మినహా అన్నింటిలోనూ అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తున్నట్లు అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నారని తెలిసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అని తేడా లేకుండా అన్ని వసతిగృహాల్లోనూ సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయి. ప్రత్యేకాధికారుల నివేదికలతో కలెక్టర్ వీటిపై దృష్టి సారించగా వార్డెన్లు, గురుకుల, కేజీబీవీ సిబ్బందిలో హడావిడి మొదలైంది.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment