పోరాటాలకు సిద్ధం కండి
ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.రావు
సత్తుపల్లి(సత్తుపల్లి టౌన్): రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులపై తీవ్రమైన పనిభారం పెరిగిందని, యాజమాన్యం వేధింపులు ఎక్కువయ్యాయని, సమస్యల పరిష్కారం కోసం కార్మికులు పోరా టాలకు సిద్ధం కావాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.రావు పిలుపునిచ్చా రు. సత్తుపల్లిలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన ఎస్‌డబ్ల్యూఎఫ్ ఖమ్మం రీజినల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్ డ్యూటీలు చేయాలనే వేధింపులు ఆపాలని, కార్మికుల ఉద్యమాలపై ఆంక్షలు ఎత్తివేయాలని, కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బ్రీత్ ఎనలైజర్ కేసుల్లో చట్టాన్ని అమలు చేయాలన్నారు. మహా లక్ష్మి పథకంతో వస్తున్న సమస్యల పరిష్కారానికి టిమ్ మిషన్లలో సాఫ్ట్‌వేర్ మార్చాలని కోరారు. అనంతరం రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుండు మాధవరావు, సహాయ కార్యదర్శిగా జె.వి.రామారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు బాణాల రాంబాబు, ఎ.వెంకటేశ్వర్లు, జె.పద్మావతి, పర్వీన, పి.నర్సిరెడ్డి, డిపోల కార్యదర్శులు సీహెచ్‌వీ కృష్ణారెడ్డి, కె.వెంకన్న, జి.రోశయ్య, బి.బాలకృష్ణ, వి.జాకబ్, టి.సుధాకర్, ఉపేంద్రాచారి, నాగేశ్వరరావు, శ్యామ్యూల్, సరిత, జగన్నాధం, వెంకటయ్య, ప్రభాకర్, సైదారెడ్డి, శంకర్ పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో రేపు వేలం
పాల్వంచరూరల్ : పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలోని వ్యాపార సముదాయాల కేటాయింపునకు ఈనెల 29న టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ రజనీకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త కాంప్లెక్స్‌లోని 1, 4వ నంబర్ల షాపులకు వేలం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వస్తువుల సరఫరాకు సీల్డ్ టెండర్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. పూలదండలు, పూల సరఫరా, టికెట్ పుస్తకాలు, వాల్‌పోస్టర్లు, ప్లెక్సీలు, బ్యానర్లు ప్రింట్ చేయడం, వస్త్రాలు, ఎలక్ట్రికల్ సామగ్రి, ప్లంబింగ్, స్టేషనరీ, పాలు, పెరుగు, కూరగాయలు, క్యారీ బ్యాగులు, లడ్డూ బాక్స్‌లు, ఫొటోప్రేమ్, లైటింగ్ ఏర్పాటు, శివాలయ ప్రతిష్ఠకు రుత్విక్‌లను సమకూర్చడం వంటి వాటికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గలవారు శుక్రవారం ఉదయం 11 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment