అద్దె పేరుతో వచ్చి.. హతమార్చి.. | - | Sakshi
Sakshi News home page

అద్దె పేరుతో వచ్చి.. హతమార్చి..

Published Thu, Nov 28 2024 12:40 AM | Last Updated on Thu, Nov 28 2024 12:40 AM

అద్దె

అద్దె పేరుతో వచ్చి.. హతమార్చి..

● నేలకొండపల్లిలో దంపతుల దారుణహత్య ● పసిగట్టకుండా మృతదేహాలపై కారం.. ● కారణాలేంటనేది అంతుచిక్కని వైనం ● మిస్టరీగా మారిన ఘటన

నేలకొండపల్లి : నేలకొండపల్లిలో దంపతుల హత్య సంచలనంగా మారింది. ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన ఇద్దరు మహిళలు పథకం ప్రకారం హత్య చేశారు. అయితే వారు ఈ హత్య ఎందుకు చేశారనేది మిస్టరీగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎర్రా వెంకటరమణ(60), భార్య కృష్ణకుమారి(54) స్థానిక బస్టాండ్‌ సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు నరేష్‌ హైదరాబాద్‌లో, కుమార్తె ఏపీలోని జగ్గయ్యపేటలో ఉంటున్నారు. 10 రోజుల క్రితం ముసుగు ధరించిన ఇద్దరు మహిళలు వచ్చి.. తమ భర్తలు రియల్‌ ఎస్టేట్‌లో పని చేస్తున్నారని, తమకు ఇల్లు అద్దెకు కావాలని అడిగారు. మాటలతో దంపతులను ఆకట్టుకుని, వారి ఇంట్లోనే భోజనం చేశారు. ఇల్లు నచ్చిందని, అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. తిరిగి మంగళవారం రాత్రి 10 గంటలకు వచ్చారు. కాగా, బుధవారం ఉదయం 8 గంటలు దాటినా వెంకటరమణ దంపతులు బయటకు రాకపోవడంతో పక్క పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న వారు చూడగా ఇంటిచుట్టూ కారం చల్లి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి చూసేసరికి దంపతులిద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు.

పోలీసులు పసిగట్టకుండా కారం చల్లి..

వెంకటరమణ– కృష్ణకుమారి దంపతులను అద్దె పేరుతో వచ్చిన ఇద్దరు మహిళలే గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గొంతుకు తాడు లేదా తీగతో నొక్కి చంపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యారు. పోలీసులు పసిగట్టకుండా ఇంటి లోపల, ఆవరణలో, మృతదేహాలపైనా కారం పొడి చల్లారు. నిందితులు పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల గాలింపు..

దంపతుల హత్య సమాచారంతో ఖమ్మం రూరల్‌ సబ్‌ డివిజన్‌ పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్‌ స్క్వాడ్‌ను ఘటనా స్థలంలో తిప్పగా.. పరిసర ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చాయి. క్లూస్‌ టీమ్‌, ఫింగర్‌ ప్రింట్‌లు సేకరించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీలను పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. ఇంటి వెనక బాగంలో పడి ఉన్న కారం డబ్బాలను, తాగిన థమ్సప్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతుల ఫోన్‌ కాల్‌డేటా పరిశీలిస్తున్నారు. ఇతర పోర్షన్లలో అద్దెకు ఉంటున్న వారి నుంచి వివరాలు సేకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అద్దె పేరుతో వచ్చి.. హతమార్చి..1
1/1

అద్దె పేరుతో వచ్చి.. హతమార్చి..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement