రెండు చేతులు లేకపోయినా...
● గ్రూపు–3 పరీక్షలకు హాజరైన జాకీర్‌పాషా
కాగజ్‌నగర్‌రూరల్: అంగవైకల్యం చదువుకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని చారిగాం ఏరియాకు చెందిన జాకీర్‌పాషా. పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినప్పటికీ పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించాలనే తపనతో నిరంతరం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఆదివారం నిర్వహించిన గ్రూపు–3 పరీక్షకు ఉత్సాహంగా హాజరై పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలోని పరీక్షా కేంద్రంలో కాలితో పరీక్ష రాశాడు. గతంలో కూడా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కూడా తన బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నాడు. అంతేకాకుండా హరితహారం కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని కాలితో మొక్కలు నాటడం, రాయడం, పెయింటింగ్ వేయడంలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment