సమగ్ర సర్వే పకడ్బందీగా చేపట్టాలి
కాగజ్‌నగర్‌రూరల్: జిల్లాలో చేపట్టిన సామాజి క, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అదనపు క లెక్టర్ దీపక్ తివారి అన్నారు. పట్టణంలోని ఎన్‌జీఓఎస్ కాలనీలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ఆదివారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు తమకు కేటా యించిన బ్లాక్‌ల్లోని ప్రతీ ఇంటిని సందర్శించా లన్నారు. కుటుంబ సభ్యుల వివరాలను నిర్ణీత నమూనాలో పొందుపర్చాలని ఆదేశించారు.
నేటి ప్రజావాణి రద్దు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్ర మం రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్– 3 పరీక్షలు, స మగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్యక్రమం రద్దు చేశామని పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయం గమనించాలని సూచించారు.
విద్యుత్ ఇంజినీర్ల కార్యవర్గం
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎన్‌పీడీసీఎల్ విద్యుత్ ఇంజినీర్ల మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కా ర్యవర్గాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆది వారం ఎన్నుకున్నారు. ప్రిసైడింగ్ అధికారి బానోత్ రాజన్న ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బ్రాంచ్ కార్యదర్శిగా జె.విలాస్, సహాయ కార్యదర్శిగా టి.తిరుపతి, కోశాధికారిగా రాంచదర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా శరత్‌కుమార్, ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శిగా ఎండీ.ఇమ్రాన్‌ను ఎన్నుకున్నారు. కార్యవర్గసభ్యులు ఇంజినీర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సభ్యులకు బి.రాజన్న, అసిస్టెంట్ ఇంజినీర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి కృష్ణ, సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు విద్యాసంస్థలకు సెలవు
ఆసిఫాబాద్‌అర్బన్: గ్రూపు– 3 పరీక్షలు నిర్వహించే విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్ర కటించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 3 కొనసాగనున్న నేపథ్యంలో సెలవు ప్రకటించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment