● మహారాష్ట్రలో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నికలు ● నేటితో ప్ర
కెరమెరి(ఆసిఫాబాద్): మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నా యి. సరిహద్దులోని చంద్రాపూర్ జిల్లా రాజూరా నియోజకవర్గ ఎన్నికల్లో కెరమెరి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. గతేడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో ఓటుహక్కు వినియోగించుకోగా.. ఆదిలా బాద్ పార్లమెంట్ స్థానంతోపాటు మహారాష్ట్రలో ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ ఓటు వేశారు. ఇప్పుడు నాలుగోసారి ఓటు వేయనున్నారు.
15 గ్రామాల్లో ఓటర్లు
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం 15 గ్రామాల్లోని ప్రజలకు రెండు రాష్ట్రాల్లో ఓటుహక్కు ఉంది. చంద్రాపూర్ జిల్లా రాజూరా అసెంబ్లీ స్థానా నికి ఈ నెల 20న పోలింగ్ నిర్వహిస్తుండగా.. 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే వారి లో సుభాష్ బావు ధోటే(కాంగ్రెస్), దేవ్‌రావు భోంగ్డె(బీజేపీ), వామన్‌రావు చటప్(సేత్‌కారి సంఘటన్), గజానంద్ గోద్రు జుగ్నాకే(గోండ్వానా గణ తంత్ర పార్టీ) మధ్య బలమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. పరంధోళి, నోకేవాడ, బోలాపటార్, అంతాపూర్ పోలింగ్ స్టేషన్ల పరిధిలోని సరిహద్దు గ్రామాల్లో సుమారు 3,597 మంది ఓటర్లు ఉన్నా రు. పరంధోళి పోలింగ్ కేంద్రం పరిధిలో పరంధోళి, తాండ, కోటా, శంకర్‌లొద్ది, లేండిజాల, ముకదంగూడ గ్రామాలు, నోకేవాడ పరిధిలో మహరాజ్‌గూ డ, భోలాపటార్ పరిధిలో భోలాపటార్, గౌరి, లేండిగూడ, అంతాపూర్ పోలింగ్ కేంద్రం పరిధిలో నా రాయణగూడ, ఏసాపూర్, పద్మావతి, ఇంద్రానగర్, అంతాపూర్ గ్రామాలు ఉన్నాయి.
పోలింగ్ కేంద్రం జనాభా ఓటర్లు పరంధోళి 2,470 1,367నోకేవాడ 700 370
భోలాపటార్ 1,102 882
అంతాపూర్ 1,902 978
మొత్తం 6,174 3,597
Comments
Please login to add a commentAdd a comment