రెండు రాష్ట్రాల పాలనలో కొనసాగుతున్న ఈ గ్రామాల్లోని ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను ఇరురాష్ట్రాల నుంచి ఎన్నుకుంటారు. ప్రభుత్వాలు కూడా ఇక్కడి ప్రజలకు ఇరు రాష్ట్రాల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు రేషన్‌కాార్డులు మంజూరు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంలో భాగంగా తాగునీటి సదుపాయం కల్పించగా.. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లకు వరకు వెచ్చించి బీటీ రోడ్లు వేయించింది. 40 ఏళ్లుగా పోరాడుతున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే సాగు భూములకు పట్టాలు లేకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. దాదాపు 80శాతం మందికి పట్టాలు లేవు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అటవీ, రెవెన్యూ శాఖలతో ఉమ్మడి సర్వే నిర్వహించింది. నెలలు గడుస్తున్నా పురోగతి లేదు. గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయనే దానిపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కొనసాగుతున్న వివాదంపై 1989 వామన్‌రావు చటప్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన సేత్‌కారి సంఘటన్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. నెట్‌వర్క్ సిగ్నల్ సమస్యను పరిష్కరించేందుకు టవర్లు ఏర్పాటు చేయడంతోపాటు ఉమ్రి నుంచి జంగుబాయి అమ్మవారి క్షేత్రం వరకు రోడ్డు వేయాలని, పట్టాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment