బాక్సింగ్‌లో గిరిజన విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

బాక్సింగ్‌లో గిరిజన విద్యార్థి ప్రతిభ

Published Mon, Nov 18 2024 2:22 AM | Last Updated on Mon, Nov 18 2024 2:22 AM

బాక్సింగ్‌లో గిరిజన విద్యార్థి ప్రతిభ

బాక్సింగ్‌లో గిరిజన విద్యార్థి ప్రతిభ

కెరమెరి(ఆసిఫాబాద్‌): మండలంలోని అనార్‌పల్లి గ్రామానికి చెందిన బాదావత్‌ శ్రీకర్‌నాయక్‌ రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో సత్తా చాటాడు. బాదావత్‌ ప్రకాశ్‌, క్రిష్ణవేణి దంపతుల కుమారుడు శ్రీకర్‌నాయక్‌ ప్రస్తుతం కాగజ్‌నగర్‌లోని ఏకలవ్య మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. పీఈటీ వనిత బాక్సింగ్‌లో శిక్షణ అందిస్తోంది. ఈ నెల 2 నుంచి 10 వరకు నిజామాబాద్‌ జిల్లాలోని గాంధారి ఏకలవ్య పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు కాగజ్‌నగర్‌ ఏకలవ్య పాఠశాల నుంచి 15 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచిన శ్రీకర్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. ఛతీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఈ నెలలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనునన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement