శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
● ఏఎస్పీ చిత్తరంజన్
జైనూర్(ఆసిఫాబాద్): శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సంజయ్‌నగర్ కాలనీ నుంచి ప్రధాన రహదారి మీదుగా గణేష్‌నగర్ వరకు.. అక్కడి నుంచి కుమురంభీం కూడలి మీదుగా పోలీస్‌స్టేషన్ వరకు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం కోసం ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించామని తెలిపారు. శాంతిభద్రతల రక్షణ, మతఘర్షణలు చెలరేగకుండా పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేశ్, డీసీఆర్‌బీ సీఐ సంపత్, జైనూర్, లింగాపూర్ ఎస్సైలు సాగర్, లింగన్న, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment