ఫిర్యాదుల పరిష్కారం కోసమే అదాలత్
తిర్యాణి(ఆసిఫాబాద్): విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసమే విద్యుత్ అదాలత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ నారాయణ అన్నా రు. మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో మంగళవారం ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని జైనూర్, సిర్పూర్(యూ), తిర్యాణి, కెరమెరి, లింగాపూర్ మండలాల్లో గల విద్యుత్ విని యోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యు త్ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతీ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రక్షణ కోసం కంచెలు ఏర్పాటు చేయాలని ఏఈలను ఆదేశించారు. ప్రజలు విద్యుత్ పొదుపుగా వాడటంతోపాటు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈ జీవరత్నం, ఏవో లక్ష్మికుమార్, ఏఏఈ తుకారం, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment