‘బుద్ధుడి మార్గంతోనే ప్రపంచ శాంతి’
వాంకిడి(ఆసిఫాబాద్): బుద్ధుడు చూపిన మార్గంతోనే ఆధునిక ప్రపంచంలో శాంతి నెలకొంటుందని భారతీయ బౌద్ధ భిక్షు సంఘం ప్రధాన కార్యదర్శి(నాగ్‌పూర్) బందంత్ ధమ్మ సారథి తెలిపారు. మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో మంగళవారం నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో పాల్గొని బుద్ధుని బోధనాలు వివరించారు. గౌతమ బుద్ధుని ప్రేరణతోనే బీఆర్ అంబేడ్కర్ గొప్ప వ్యక్తిగా, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని తెలిపారు. ప్రతీ మనిషి శాంతి మార్గాన్ని అనుసరించడం ఎంతో అవసరమన్నారు. నాగ్‌పూర్ దీక్ష భూమి భిక్షు భంతే రాహుల్ మాట్లాడుతూ సమాజంలో మూఢ నమ్మకాలు మనుషులను విజ్ఞానం వైపునకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయని తెలిపా రు. వాంకిడిలో మార్చి 1 నుంచి 10 వరకు నిర్వహించే శ్రామ్‌నేర్ ధమ్మ దీక్ష శిబిరాన్ని సద్విని యోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం భిక్షువులను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, నాయకులు విజయ్ ఉప్రె, విలాస్ ఖోబ్రగడె, దుర్గం సందీప్, మహేశ్, రోషన్, రాజేశ్వర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment