దరఖాస్తు గడువు పొడిగింపు
ఆసిఫాబాద్: తెలంగాణ క్రైస్తవ మైనార్టీ ఫైనా న్స్ కార్పొరేషన్ ద్వారా ఇందిర మహిళా శక్తి పథకం కింద శిక్షణ, ప్లేస్‌మెంట్ కార్యక్రమం ద్వారా అర్హత గల క్రైస్తవ మైనార్టీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించేంకు దరఖాస్తు గడువు ఈ నెల 25 వరకు పెంచినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రమాదే వి తెలిపారు. అభ్యర్థులు తెల్లరేషన్ కార్డుదారులై ఉండాలన్నారు. కనీస విద్యార్హత ఐదో తరగతి, మీసేవ ద్వారా బాప్టిజం బీసీ సీ సర్టిఫికెట్ ఉండాలని సూచించారు. గత ఐదేళ్లలో తెలంగాణ క్రిష్టియన్ మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేద ని స్వయం ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్నారు. ఆసక్తి గల మహిళలు ఈ నెల 25లోగా https://tgobmms.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
బాల్య వివాహం అడ్డగింత
బెజ్జూర్(సిర్పూర్): మండలంలోని బారెగూడ గ్రామంలో మంగళవారం ఓ బాల్యవివాహా న్ని అధికారులు అడ్డుకున్నారు. 16ఏళ్ల బాలిక కు అదే గ్రామానికి చెందిన యువకుడితో వి వాహం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. విష యం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు ఆపరేషన్ స్మైల్– 11 కార్యక్రమంలో భాగంగా కాగజ్‌నగర్ డివిజన్ టీం సాయంతో బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఆపరేషన్ స్మైల్ టీం ఇన్‌చార్జి ఎస్సై దుర్గం రాజయ్య మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి జరిపించాలని సూచించారు. కాగా బాలికను బెజ్జుర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో చేర్పించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజ ర్లు కరుణ, సత్య, జిల్లా బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్ డోంగ్రి ప్రవీణ్‌కుమార్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ ఝాన్సీ రాణి, పోలీసు సిబ్బంది మౌనిక, విజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment