‘ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించే వరకు పోరాటం’
ఆసిఫాబాద్: బడ్జెట్ సమావేశాల్లో ఆశ వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు నిర్ణయించే వరకు పోరాటం కొనసాగుతుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో కనీస వేతనాలపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని బూర్గుడ నుంచి కలెక్టరేట్ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశవర్కర్లు పాదయాత్ర నిర్వహించారు. ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు సమ్మె చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఐఏఎస్ కమిటీ ఏర్పాటు చేసి పక్కన పెట్టిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆశ వర్కర్లకు జీతాలు పెంచుతామని, ఈఎస్‌ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరిస్తుందని మండిపడ్డారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, సభ్యులు రామాచారి, టీకానంద్, ఆశ వర్కర్లు స్వరూప, వనిత, నవీన, మొగుర, భారతి, సరోజ, లక్ష్మి, పంచశీల, భీంబాయి, శ్రీలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment