గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి
ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటీడీఏ కృషి చేస్తోందని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. 76వ గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని ఆదివారం ఐటీడీఏ ప్రాంగణంలో మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయిలతో కలిసి ఐటీడీఏ పీవో జాతీయజెండా ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గిరిజనుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు బాగా చదివి ఐపీఎస్, ఐఏఎస్‌లుగా రాణించాలన్నారు. అనంతరం ఐటీడీఏ ద్వారా గిరిజనాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను పీవో వివరించారు. 11 మండలాల్లో 11 పీహెచ్‌సీల్లో అవ్వల్ అంబులెన్స్ ద్వారా 2023–24లో 2644 మంది గర్భిణులకు ప్రసవాలు జరిగినట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న వారిని సర్టిఫికెట్లు అందజేశారు. ఏపీవో జనరల్ వసంత్‌రావు, ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఈఈ తానాజీ పాల్గొన్నారు.
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
Comments
Please login to add a commentAdd a comment