లక్సెట్టిపేట: మండలంలోని చందారం గ్రామానికి చెందిన మిల్కూరు మల్లేశ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రంగపేట గ్రామానికి చెందిన ఆవునూరి రాజయ్యకు వారసత్వంగా వచ్చిన భూమిలో సాగు చేసుకుంటున్నాడు. అయితే పల్లికొండ రమేశ్ నుంచి ఆ భూమని కొనుగోలు చేశానని మల్లేశ్ శనివారం ట్రాక్టర్ వీల్స్‌తో పంటను ధ్వంసం చేశాడు. అడ్డుకోబోయిన రాజయ్యను కులం పేరుతో దూషించి నెట్టివేశాడు. బాధితుడు రాజయ్య ఫిర్యాదుతో ఆదివారం అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment