దివ్యాంగులకు అండగా పథకాలు
మంచిర్యాలటౌన్: దివ్యాంగులకు అండగా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 25 మంది దివ్యాంగులకు ఉపాధి, పునరావాస పథకం కింద వంద శాతం సబ్సిడీతో రూ.50 వేల చెక్కులు మంజూరయ్యాయి. వాటిని గణతంత్ర వేడుకల సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు ప్రదానం చేశారు. బ్యాంకు లింకేజి ద్వారా రూ.2 లక్షలు, రూ.3 లక్షల చెక్కులను ఇద్దరికి అందించారు. ఉచిత ఉపకరణాల పంపిణీలో భాగంగా మోటార్ వెహికిల్ అందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రవూఫ్‌ఖాన్, సీడీపీవో విజయలక్ష్మి, స్వరూపరాణి, ఎఫ్‌ఆర్‌వో ఫర్జానా, కోఆర్డినేటర్ సౌజన్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment