ఉత్తమ శకటంగా ‘ఆర్టీసీ’
ఆసిఫాబాద్: గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన శకటాల ప్రదర్శనలో ఆర్టీసీ బస్సు ఉత్తమ శకటంగా ఎంపికై ంది. ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆర్టీసీ అందిస్తున్న సేవలను తెలిపే విధంగా శకటాన్ని రూపొందించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి బస్సులో పరేడ్ గ్రౌండ్ చుట్టూ ప్రయాణించారు. అనంతరం డీఎం విశ్వనాథ్‌కు ప్రశంసాపత్రం అందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment