విద్యుత్ చార్జీలపై మాట తప్పిన కూటమి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాట తప్పిందని, ప్రజలను మోసగించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని, సర్దుబాటు చార్జీల బాదుడుకు వ్యతిరేకంగా సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యాన విజయవాడ బీసెంట్ రోడ్డులో ఽసోమవారం ధర్నా జరిగింది. కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాలు ఎలా మోపుతుందో వివరిస్తూ వినూత్న ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ పంపిణీ సంస్థల తాజా నోటిఫికేషన్ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రూ. 17 వేల కోట్లు విద్యుత్ భారం వేస్తోందన్నారు. ఈ నెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం.. విద్యుత్ భారాలు, అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రచార ఆందోళన చేస్తుందన్నారు. 14న ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. నేతలు రమణరావు, కృష్ణ, దుర్గారావు, ఎన్.శ్రీనివాస్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
సీహెచ్ బాబూరావు
Comments
Please login to add a commentAdd a comment