ధన్వంతరి జయంతి నిర్వహణకు కృషి
భవానీపురం(విజయవాడపశ్చిమ): భగవాన్ ధన్వంతరి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్‌రావు, బోడె ప్రసాద్, వర్ల రాజా తెలిపారు. భగవాన్ ధన్వంతరి జయంతి ఉత్సవంలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా నాయీబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడారు. ఆయుర్వేద వైద్యం, సంగీతం వృత్తిగా చేపట్టిన నాయీ బ్రాహ్మణులు సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ధన్వంతరి జయంతిని రాష్ట్రంలో అక్టోబర్ 29న అధికారికంగా నిర్వహించాలన్న నాయీ బ్రాహ్మణుల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ఆలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న వాయిద్య కళాకారులను రెగ్యులర్ చేయాలని, కేశఖండన కార్మికులకు టైం స్కేల్ అమలు చేయాలని, సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ సంఘాల ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన సూర్యపల్లి శ్రీనివాస్ రచించిన ‘ది నెగ్లెటెడ్ ఓబీసీస్’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తొలుత ఉత్సవ నిర్వాహకులు వణుకూరు సురేష్, రిమ్మనపూడి బ్రహ్మేశ్వరరావు, పి. మురళీకృష్ణ, అవనిగడ్డ ఆంజనేయులు భగవాన్ ధన్వంతరి జయంతోత్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు అన్నవరపు బ్రహ్మయ్య నిర్వహించిన కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి బి. రామారావు అధ్యక్షత వహించగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.రవీంద్రనాథ్ బాబు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీనివాసరావు, అసెంబ్లీ పూర్వపు ఓఎస్‌డీ ఎం.ప్రభాకరరావు, రాఘవేంద్రరావు, జి.ధన్వంతరి, మల్కాపురం కనకారావు, డి.సూరిబాబు, తెన్నేటి సోము పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు గద్దె, బోడె, వర్ల
Comments
Please login to add a commentAdd a comment