![నులిపురుగుల నివారణను అలక్ష్యం చేయొద్దు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mcpm05-310106_mr-1739217105-0.jpg.webp?itok=fT7HNJ3w)
నులిపురుగుల నివారణను అలక్ష్యం చేయొద్దు
మచిలీపట్నంటౌన్: రక్తహీనతకు, అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నులిపురుగులను నివారించి ఆరోగ్యకర జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం(డివార్మింగ్ డే) సందర్భంగా సోమవారం నగరంలోని పోర్ట్ రోడ్‌లోని ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ డీకే బాలాజీ చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల 49వేలకు పైగా పిల్లలకు ఉచిత నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఉన్న 1నుంచి 19ఏళ్ల లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులు సూచించారు. నులి పురుగుల నియంత్రణ కీలకమైన అంశమని, దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వైద్య ఆరోగ్య, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన మూడు లక్షల 49 వేల 138 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశామన్నారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, స్వయం సహాయక బృందాలు, తల్లిదండ్రులు ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఆల్బెండజోల్ మందు విషయంలో తల్లిదండ్రులు అపోహలు వీడాలని ఇది పూర్తి సురక్షితమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ శర్మిష్ఠ, డెప్యూటీ డీఈఓ బి. శేఖర్ సింగ్, ఎంఈఓలు వైఎస్‌ఆర్కే గురు ప్రసాద్, ఎంవీఎస్ దుర్గ ప్రసాద్, పాఠశాల హెచ్‌ఎం పద్మావతి ఉన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment