![‘సూర్య ఘర్’ లక్ష్యం సాధిద్దాం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mcpm07-310106_mr-1739217106-0.jpg.webp?itok=ZB16KQKt)
‘సూర్య ఘర్’ లక్ష్యం సాధిద్దాం
మచిలీపట్నంటౌన్: సూర్య ఘర్ పథకానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం. సత్యానందం అన్నారు. స్థానిక ఎస్‌ఈ కార్యాలయంలో సోమవారం విద్యుత్, మెప్మా శాఖల అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్య ఘర్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందేందుకు జిల్లాలో 92,227 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే ఇప్పటి వరకు 543 కనెక్షన్లను మాత్రమే బిగించామన్నారు. అలాగే జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఇంటికీ ఈ పథకాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేసి ఈ పథకాన్ని ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మెప్మా పీడీ సాయి బాబు విద్యుత్ పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ ఎస్సీ సత్యానందం పిలుపు
Comments
Please login to add a commentAdd a comment