గౌరుపై కేసులు లేవంట! - | Sakshi
Sakshi News home page

గౌరుపై కేసులు లేవంట!

Published Sat, Apr 20 2024 1:50 AM | Last Updated on Sat, Apr 20 2024 1:50 AM

-

కర్నూలు(సెంట్రల్‌): నామినేషన్‌ వేసే సందర్భంలో తనపై, తన భర్త గౌరు వెంకటరెడ్డిపై ఎక్కడా కేసులు లేవని టీడీపీ పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి గౌరు చరితారెడ్డి అఫిడవిట్‌ సమర్పించారు. తన పేరిట రూ.3.08 కోట్లు, తన భర్త పేరిట రూ.5.03 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని చూపించారు. తనకు రూ.24 లక్షల విలువ చేసే రెండు కార్లు, తన భర్తకు రూ.5 లక్షల విలువ చేసే మహేంద్ర ట్రాక్టర్‌ ఉందని ఆమె అందులో పేర్కొన్నారు. రూ. 74 లక్షల విలువ చేసే 1,100 గ్రాముల బంగారం ఉందని.. తన పేరిట రూ.14,85,000, భర్త పేరిట రూ.96,99,000, కుమారుడు పేరిట రూ.67,43,000 చరాస్తులు ఉన్నాయని చూపించారు. తనకు బ్యాంకుల్లో రూ.22,57,500, భర్తకు రూ.7,77,000 అప్పులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

సమానంగా అప్పులు.. ఆస్తులు

కోడుమూరు(ఎస్సీ) వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిమూలపు సతీష్‌కు ఆస్తులతోపాటు అప్పులు కూడా సమానంగా ఉన్నాయి. తన పేరిట రూ.8.83 కోట్లు, భార్య పేరిట రూ.2.19 కోట్లు, కూతూరు రీతు జాస్మిన్‌పేరిట రూ.19.50 లక్షలు, కుమారుడు రిత్విక్‌ శ్యామూల్‌ రూ.13.24 లక్షల చరాస్తులు ఉన్నట్లు చూపారు. కాగా, ఆయనకు వివిధ బ్యాంకులు, ఇతరా చోట్లా రూ.8.50 కోట్లు, భార్యకు రూ.7.06 లక్షల అప్పులు ఉన్నాయి.

220 గ్రాముల బంగారం

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి 220 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. కూతూరుకు 200 గ్రాముల బంగారం ఉంది. ఆమె మొత్తం చరాస్తులు విలువ 83.64 లక్షలు కాగా, ఆమె భర్త లేట్‌ నారాయణరెడ్డి పేరిట రూ.28 లక్షలు, కూతూరుస్నేహారెడ్డి పేరిట రూ.8.86 లక్షల ఆస్తులు ఉన్నాయి.

స్థిరాస్తులే ఎక్కువ

ఆలూరు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి.విరుపాక్షికి చరాస్తుల కంటే స్థిరాస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఈయనకు చిప్పగిరిలో 26.04 ఎకరాలు, ఆయన భార్యకు అక్కడే 10.98 ఎకరాల భూమి ఉంది. ఆయనకు రూ.6,66,00,000 స్థిరాస్తులు ఉన్నాయి, ఆయన భార్యకు కూడా 46 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకుల్లో రూ. 84,18,709 అప్పు ఉన్నట్లు ఆయన ఆఫిడవిట్‌లో చూపారు.

అఫిడవిట్‌ సమర్పించిన

టీడీపీ అభ్యర్థి గౌరు చరిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement