No Headline
పేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టళ్లు బందీఖానాలను తలపిస్తున్నాయి. వసతి గృహాల చుట్టూ ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం.. శిథిలావస్థకు చేరి భయపెట్టే పైకప్పులు.. అద్దాలు పగిలిన కిటికీలు.. దోమల రొద.. చలిగాలుల బాధ.. ఇరుగైన గదులు.. చిరిగిన దుప్పట్లు.. నిద్రలేని రాత్రులు.. ఇలా ఎన్నో సమస్యలు విద్యార్థులను పీడిస్తున్నాయి. ఒక్క రోజు మాత్రమే కాదు.. అక్కడ ఉన్నన్నీ రోజులు ఈ కష్టాలు భరించాల్సిందే. హాస్టల్ విద్యార్థులకు భద్రత, సౌకర్యాలు మెరుగుపరచాలని న్యాయస్థానం ఆదేశించినా పాలకులు, అధికారుల్లో చలనం కరువైంది. సోమవారం ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి వచ్చిన హాసళ్లలోని విద్యార్థుల కష్టాలు చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.
కోడుమూరు మండలం లద్దగిరి బీసీ హాస్టల్‌లో ఆరుబయట స్నానాలు చేస్తున్న విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment